Template Options

Background pattern

fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar
Attention to software engineers belongs to "Thogata Veera kshatriya" community! Software engineers those who are interested to spend few hours of time in weekends to construct this website which is established for the welfare of our community members please contact Koyyaguru Venkata Chandra Mohan ::9966391851 , Ummadisetti Subramanyam: 9985923449, palla chaitanya +91 70136 69461 || Welcome To Thogataveerakshatriya || Our History || Donation: Sri Chowdeswaridevi Thogata Veerakshatriya A/C No-38870444368. IFSC Code- SBIN0020948 Branch Name- RTC kadapa, Kadapa || Contact Email || Ph No : +91 891-993-3708

CHOWDAMMA PADYALU

CHOWDAMMA Patalu

1వ పాట --- ఆదితాళము --- గణపతి ప్రార్థన

పార్వతీ పుత్రుండు © పరమేశ్వరుని జూడ

ఎలుక వాహనమెక్కి © వెళ్ళె తనుయాటా

అమరంగ వెనుకయ్యను © ఆత్మలో దలచేరు

సంతోషములు గలుగు © సకల జనులకును

హర హరా మిముదలచు © హరుని పుత్రుండు !!ప!!

సకల విద్యల గురువు © స్వామి గణనాథా !!హరహరా!!

హర హరా మిముదలచు హరుని పుత్రుండు !!పల్లవి!!

విష్ణు బృహ్మ దేవుడీశ్వరుడు మొదలుగా | మదిలోన వెనుకయును మరువక దలచేరు|

సర్వ దళములతోన సాధించె త్రిపురాలు | కైలాస వాసనుడు కార్యాన దలచె | !!పల్లవి!!1!!

వేద శాస్త్ఱాలందు ఎంచేరు వెనుకయను | మోదముగ సిద్దులే మ్రొక్కి తలచంగా |

సంగీత సాహిత్య సకల విద్యలకెల్ల | రవికోటి తేజకుడు రాజు వెనకయ్యా !!పల్లవి!!3!!

ఎన్నగల దేవతలు వెనుకయను దలచేరు | వ్యాస వాల్మీకులే వెనుకయను దలచేరు

కలిగె వైభొగములు కలకాలమెల్ల |సప్త మహారుషులకే స్వామి వెనుకయ్యా !!పల్లవి!!4!!

కురుచనీ పాదాలు గుజ్జురూపున బొజ్జ | ఏకదంతము తొండమేనుగారూపూ |

పాలించి గుర్రము సరువయ్య మతిలోన గౌరమ్మ నీకొడుకు కరుణతోనేలే | హర హరా |ప|

2వ పాట--- ఆదితాళము --- నొసటమెరుగుడ్డులే పసనంబు కోరలే

నొసటమెరుగుడ్డులే పసనంబు కోరలే | పసని నల్లనిరూపు బాలఓయమ్మా| పసనై కస్తురిబొట్టు నీలి పొత్లము గత్తి |దిట్టముగా నందపురి చౌడేశ్వరమ్మా భూలోక మాతవే| భుజబలములే మాకూ, విద్య బుద్దుల గురువు రావో చౌడమ్మా| భూలోక మాతవే| భుజబలములే మాకూ|ప||

వజ్రాలు దాపినా బొద్దులా కడియాలు గద్దరింపుచు జంగ కాళిపెండెములూ భద్ర కాళివి రావో |భూ|ప|1|

బహుళ శంకరి నీవూ సిద్ధముగ రతివీర చౌడమ్మ రావో|భూ|ప|2|

నడిమి వడ్డాణమే నాగబోనము తొడగి నాడు పూజలు చేయ నేడు వేడుకలాయె | ఆదిశక్తీవని వేదములు చదివేరు మోదముతొ నిను కీర్తించేరు చౌవుడూ| ప|3| పసని బండారులే రతులు పూజలుచేయ రతులందు వస్తిమీ రతికళలు నిలిచీ, జగతి ప్రఖ్యాతిగా యేలితివో తిప్పమను, మతి లోన వెలసితివో మహమ్మాయి చౌడూ|భూ|ప|1

8వ పాట--- ఆదితాళము --- ఈశ్వరా, సూర్యవంశమూనా,యిక్షువాకనె రాజయా

ఈశ్వరా, సూర్యవంశమూనా,యిక్షువాకనె రాజయా,అతడు బ్రహ్మనుగూర్చి, యాఘోర తపమే జేసెనూ, అనేకా వెయ్యేండ్లకూను హంసవాహన మెక్కుకా, అతనికిని ప్రత్యక్షమాయను, ఆదిబ్రహ్మదేవుడూ, యేమిటీకీ తపము జేస్తివి, యరుగ మాతో జెప్పమంటె. మీకు దైవామైన దేవాపూజ యిమ్మని యడిగెను. యిస్తినోయీ రాజశేఖర, యిదిగొ కొమ్మని పలికెనూ, తపములు చాలించి బ్రహ్మకు దండమొప్పుగ బెట్టెనూ:ప: ఆదిపూర్వము, వీరుల వార్తలు, అవధరించుడి పెద్దలు. తోయజా పుష్పాండ జయముని తొగటవారి గురువయా. కచిత్తము, గురువు దైవము. వేదశాస్త్రము వినరయా:ప: 1

రంగస్వామి, కామండల తీర్థము. రమ్యముతో యిచ్చెనూ, అందుకొనెనే, రాజశేఖరుడధిక సంతోషంబునూ, దైవమాయని, తలచి కమండల తీర్థము, తామెరా కొలనులోపల విడిచెనూ పుట్టెనే పుష్పాండ జయముని పుణ్యతామర పూవునా, అతనిజూచి యిక్షువాకూ, ఆశ్చర్య మొందెనూ, మహాత్మా మీరెవ్వరయ్యా, మహా చోద్యములాయెనూ నీవుచేసిన బ్రహ్మ తపమున,నిజముగ నీ తనయునీ భాసురంబుగ తండ్రినీవని, భాహులెత్తి మ్రొక్కెనూ:ప:1: కరుణతోడుత కొమారుణ్ణి, గారవంబున బిలుచుకా, ఆనందముతో యిద్దరూ అయోధ్య పట్నానికి వచ్చిరి. రాజ్యమేల్మని కుమారునికీ,రాయ పట్నము గట్టెనూ యేలెనే పుష్పాండ రాజై యేడు దీపాంత్రాలునూ, యినకులావంశాబ్ది చంద్రుడు ,యిట్లు యేలుచుండగా,వంశగురు వశిష్టు వచ్చెను.

పుణ్యకాలము నాడయా అట్టిగురువును జూచిరాజూ అనేకా పూజించెనూ, సాష్టాంగ మ్రొక్కితే, సత్యవాక్యముల దీవించెనూ:ప:3: యంతోవేడుక సేవించెను, సంతోషంబే చేసెనూ గురువుకన్నా దైవమేది, గుణముగల్లవారికి యిటువలెనే సేవజేయుచు, వినయార్థముతోనయా, వినవయ్యా గురుస్వామి, విన్నపము నాదొక్కటీ, అతనిభావము, హృదయమందు అంతయూతా తెలుసుకా .యేమివార్తా తెల్పుమాని, వేడుకాతో అడిగెనూ. ఎక్కువ యవరు ముగురు మూర్తులు, కాగములు, సేవింతునూ ముదముతో, ఆదిత్యమైన, మూలమంత్రము దెలుపుమా, శిశువు మాటల వినియు గురువు, చిరునవ్వేనవ్వెనూ, పరబ్రహ్మ పరతత్వమైన పరంజ్యోతే కారణం:ఫ6:

భక్తితో గురుపాదములకు, మ్రొక్కి యానతిమ్మనే, భరితమైన, ఓంకారమంత్రము, భావమంతయు తెలిపెనూ, తప్పక ఈ మంత్రజపమున, తపములూ సేవింపుమా, శాంభవీనీకు సాయమవునని: చాల ఆనతిచ్చెనూ,గురువుచే వుపదేశమందెను, దివిజులందరు మెచ్చగా. తల్లిదండ్రికిమ్రొక్కి ధర్మదీవెనాలె అందెనూ, భూసురులు బుధులు మెచ్చగ, పూర్వ తామెర కొలనకూ, పుణ్యతా నుజ్ఞానమున పుష్పాండు డక్కదపోయెనూ, పదివేల ఘోరతప, బ్రహ్మాండ భాండముగజేసెను. పంచముఖముల పరంజ్యోతికి భావమక్కడ నిలచెనూ,: ప: : పారిజాతమైన తల్లి ప్రత్యక్షమై తానిలిలచెనూ, ఓంకార తపసి నీకూ యేమికావలె యడుగుమా, అట్టెతపములు చాలించి ఆదిలక్ష్మికి మ్రొక్కెనూ. అన్నిటానుగలిగినా జగదాంబతో నిట్లనియెనూ, సహంతన సౌభాగ్యమూలూ, చాలయిమ్మని అడిగెనూ, తప్పకా మావంశమూన ధర్మదేవతై నిలువుమా, దివిజులెరుగగ అభయమిచ్చెను, దివ్యమంగలమూర్తీ, వార్తగా త్రిపురాలు గెలచీ, వస్తూ మీకులదైవమై:ప:4:

దేవశంకరి నీవెదిక్కని జ్ఞానముతోయుండెనూ, మహాశక్తై త్రిపురములకూ, మాయలే కల్పించెనూ.సాహసంబుగ రాక్షసూలు: సకల లోకమూలనూ, అల్లకల్లోలంబు చేయగ, అఖిల దేవత లదిరిరి అప్పుడూనూ ముగురు మూర్తులు, ఆదిపరంజ్యోతినీ, అనంతకోటి వేదమాతను, ఘోరముగ కొనియాడిరీ, వచ్చిరావీ చెట్టునోమూ, ఫలమునా, వారిలో ఉదయించెనూ చట్టుబండన శివుని చమటన దేవి వుద్ధ్వటించెనూ, సకల దేవతలు శాశలెగ పూష్వాండ జయముని పోయి మ్రొక్కెను, శాసబియ్యామిచ్చి శాంభవి,శాయమైతిని పొమ్మనే, ఒచ్చి అగ్ని గుండమందూ హోమమూలు జేసితే వైభోగవీరులు బుట్టిరీ చౌడమ్మ వెంట త్రిపురాలు గెలచి గురుదైవములకె మ్రొక్కిరీ, అభిమాన రక్షక వీరులానీ, ఆదిదేవతలందరూ, పంచవన్నె వస్త్రాల విద్యకు , పట్నమమర గట్టిరీ, కులదైవమైనతల్లీ , పదములు గురము సరువయ్య పాడెనూ, మదిలోనా దూర్వాసముని దేవుడైతాబలికెనూ:ప:3:

26వ పాట--- ఆదితాళము --- హరుని చమటన- కాసిలోపల- అసురసంహరి – చౌడుబుట్టెను

హరుని చమటన- కాసిలోపల- అసురసంహరి – చౌడుబుట్టెను-వేదబ్రాహ్మణ సాక్షికొరకై వెలసె నందవరమునా- పదనార్గుర సంహరించి- ఖరామొండెమూలచేసి, శిరులు మించు ఓంకాళిశక్తై

శివానందుల కోటనా- పేరుగా పెదవాడయందు ఘోరరూపముతోనయా- దురితమూగ ఓరుగంట దుర్గివై తావెలసెనూ- రాయభూపతి- బిరుదునిలిపెను- రాజ్యములగొనిపోక చౌడమ- హృదయరాజుల-

పానుగంటా సదానదామూర్తివి ||ప||

అష్టదశపీఠాలు వెలసిన- ఆదికాలము చౌడమా- సాయమాయెను హరుని బిడ్డా- చాలనమ్మీకొల్వరో |ప|1| దండిదురితుల చెండివేసెను- స్మారమున తనకొండనా- భద్రకాళీ- వుదయగిరిన- రుద్రమూర్తివో చౌడమా- నేరుపురి నెల్లూరి స్థలమున- నెరయ కంచి పట్నమందూ-

కనకవైభోగములతోనా- కామాక్షైతా వెలసెనూ- పంచమైజ్యోతూలతోనా భాహురె రేపల్లెచౌడమ వెలయ ముగురికి తల్లి తానై గాలిపూజా గట్టెనూ- చెలగిశ్రీరంగపట్నమందు- చామండి చౌడేశ్వరమ్మా- తీరుగా తిరుమాలపురమున వీరమూర్తివోచౌడమా|ప||1|

శంభుమూరితి, తుంబురాన- చెలగె వేడుకతోనయా- భానుకోటి తేజములనూ- భావపురమున చౌడమా- చాలయేడ్గురి దేవరాజుల చారుకొలతలు వేశిగెలచెను- దేవశంకరి తాండ్వమాడెను-

దేవగిరిగుర్గాననూ- భాద్రిష్టి ఆయుధాలుతీసుక బలుదైతులమీదికీ- బలిమిసింహ్మామెక్కి నడచెను- ఘనత చౌడమ ముందయా- లంకలో భయంకారివయ్యు- రాముకార్యము జయము చేస్తివి- మళీయాళ దేశమందూ- మహాశక్తై వెలసెనూ|ప||3| మంత తంత్రమార్గములకూ-

మహిమతోడుత సాయమాయెను- కొల్లపురమున హృదయలక్ష్మి కోర్కెలు వీడేర్చెనూ- మదిలోవితివనితలతురమ్మా- ఆత్మలో కల్యాణివమ్మ- పట్టిపూజలు గొంటివమ్మా పరమాకల్యాణివీ-ముజ్జగంబులు గల్గియుండిన- వుజ్జనీ మహంకాళివమ్మ- మొదట సిద్ధుల కొలువుదీర్చిన- మగుటమాయర- జలమ్మా అమ్మనిన్ను తలచెటందుకు- అలివిగాదే- యెవరికైన మాపాలిటీ మధురాక్షివమ్మా- మధురలో నెలకొంటివీ |ప|| అంబజెగాదాంబవమ్మ అలాంపూరి జోగులాంభ

కరుణతోడుత ప్రజలనేలిన కందనూరి చౌడమా- ఘనతమించగవినుతికెక్కగ- గంగపురము చౌడమా-

చాలనొప్పుగ మీనవరమున మేలుశాంభవినీవమ్మా, అనుమానము లేక- అనుమానుగల్లా చౌడమా- హరునికీ బిక్షంబు పెట్టిన- అన్నపూర్ణవు నీవమ్మా ఈశ్వరునికీ- బిడ్డవయ్యూ.

విశ్వరూపముతోనవెలసి- ఆదిదేవతలకభయమిచ్చిన- ఆదిశక్తివినీవమ్మా|ప||

గౌరుపార్వతి గారువంబున- అమరులాకూ తల్లివమ్మా స్థిరముగా భ్రమరాబవయ్యు- పర్వతా నెలకొంటివీ- ఓంకాళి గోరంజివాయి వరుసరాజుల- కెరుకజెప్పిన నాదభేదములన్నిటికి బహునాంచారివి నీవమ్మా- అనంతా కాలమునాడూ ఆదిపరంజ్యోతివమ్మా చౌడూనిన్ను నమ్మికొలచినవారీకి- సకల భాగ్యములిస్తువూ యనంగా- యేన్నూరుకోట్ల భూమండలాన నిండువేడుక, మందరాగిరి పర్వతాన- మలయ తాండవమాడగా|ప|| కాశిగంగా, కావేరుకలుగు

పుణ్యతీర్థమూలు ప్రజల ప్రవణం జేస్తివో- భాకీర్తివయ్యు ధరణిలో- ఆదిపూర్వము గుఱ్ఱము సరువయ అమృతవాక్యములిస్తివి- అష్టదిక్కుల నెలకొన్నా దిష్టమూర్తి ఓ చౌడమా- యతుల మునులకు అభయమిస్తివి.

గుఱ్ఱంసర్వుయ్య మదిలొనుంటివి. నాలుగుయుగమూలకూ జగన్నాధవో చౌడేశ్వరీ, సంతసంబుతో గుఱ్ఱము సర్వుయను స్వామినీవే నేలుకొంటివి- జయముతోడుత గుంటుమల్లూ చౌడు మహిమలు తెలియరో|ప||

CHOWDAMMA PADYALU & Jyothulu Videos

fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar

Excepteur sint occaecat cupidatat non proident, sunt in culpa officia.Lorem ipsum dolor sit amet.

consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Donation

Sri Chowdeswaridevi Thogata Veerakshatriya
A/C No-38870444368.
IFSC Code- SBIN0020948
Branch Name- RTC kadapa